
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 15.03.2025: సామాజిక న్యాయ సాధకులు మాజీ ఎంపీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కామ్రేడ్ బి.యన్.రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుంగతుర్తి మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, పూలే ఆధ్యాయ వేదిక కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య పిలుపు నిచ్చారు. శనివారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో జరిగిన బి.ఎన్.రెడ్డి జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలతో పాటు అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కావాలని పోరాటం చేసిన యోధుడని వారన్నారు. శ్రీరామ్ సాగర్ జలాల కోసం పరితపించి ఆనాడు ఎన్నో ఉద్యమాలు చేసి ఈ ప్రాంతానికి గోదావరి జలాలను రప్పించిన ఘనత మాజీ ఎంపీ బి.ఎన్.రెడ్డి కే దక్కిందని వారన్నారు. నాడు నిజాం నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని విముక్తి చేశారని అన్నారు. ఇంకా ఎన్నో పోరాటాలు చేసిన ఘనత దక్కిందని అన్నారు. ఆయన ఆశయ సాదన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికు ముందుగా బి.ఎన్.రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమన్న, కందుకూరి శ్రీను, సిపిఎం నాయకులు కడెం లింగయ్య యాదవ సంఘం నాయకులు బేతు లింగయ్య, సిపిఐ మండల కార్యదర్శి ఎండి ఫయాజ్, సిపిఐ నాయకులు తిప్పరాల సోమయ్య, నిహారిక తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316