
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట/మోతే, 05.03.2025: మోతే తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను ట్యాంపరింగ్ చేసినందుకు ఇద్దరు గిర్ధావర్ లను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మోతే మండల గిర్ధావర్ గా విధులు నిర్వహిస్తున్న జే నిర్మలదేవి, అదనపు గిర్ధావర్ షేక్ మన్సుర్ అలీలు పాత పహాణి రికార్డులలో పేర్లు లేకపోయినా పేర్లు ఉన్నట్లు సృష్టించి ధరణి లో మిస్సింగ్ సర్వే నెంబర్లు కింద 11 దరఖాస్తులు చేపించి భూమి ఉన్నట్టు తప్పుడు ధ్రువీకరణ చేసి పంపించటం జరిగిందని అన్నారు. నిన్న రాత్రి ఇట్టి విషయమై కలేక్టర్ మోతే తహసీల్దార్ కార్యాలయానికి వేళ్ళి రికార్డులు పరిశీలించి ట్యాంపరింగ్ చేయటం జరిగిందని నిర్దారించడమైనది. పలు రికార్డులను ట్యాంపరింగ్ చేసి ఉన్నత అధికారులను తప్పుదోవ పట్టించిన మోతే మండల గిర్ధావర్ జే నిర్మలదేవి, అదనపు గిర్ధావర్ షేక్ మన్సుర్ అలీ లను సస్పెండ్ చేస్తున్నట్లు అలాగే తదుపరి విచారణలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316