
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 05.03.2025: సువెన్ ఫార్మా సహకారంతో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్ ప్రశంసించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో విద్యార్థినీ, విద్యార్థులకు స్కాలర్ షిప్స్ చెక్కులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఈ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సువెన్ ఫార్మా, అక్షర ఫౌండేషన్ సేవలను వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో విద్యార్థులు అకాడమీక్ పరీక్షలతో పాటు పోటీ పరీక్షల్లోనూ రాణించాలని అడిషనల్ ఎస్పీ నాగేశ్వర్ రావు సూచించారు. ఈ సందర్బంగా సువెన్ ఫార్మా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు చేసిన సైన్స్ ప్రయోగాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. విద్య, వైద్యం, వైజ్ఞానిక, సాంస్కతిక, సామాజిక, కళారంగాల్లో విశేష సేవలను అందిస్తున్నట్టు అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస శృతి రాంకుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సువెన్ ఫార్మా హెచ్ ఆర్ వెంకట రమణ, పీ ఆర్ వో సైదులు, జీవన్, అక్షర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రుద్రంగి కాళిదాసు, పాల్వయి వెంకన్న, నజీర్ భాషా, అప్పారావు, మర్రు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316