
***సూర్యాపేట నియోజకవర్గ మరియు పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్, రీచ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ…

న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 27.03.2025: సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు దగ్గర అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో సూర్యాపేట నియోజకవర్గ మరియు పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్, రీచ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య పై గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షులు ఇరుగు సంసోను, ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ నిన్నటి రోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ నాయకులను హత్య చేసిన దుండగులు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని అన్నారు.

సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవ. జలగం జేమ్స్, వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొజ్జ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది హెయమైన పిరికి పందా చర్య అనీ అన్నారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొల్లు జాన్ పాల్, రెవ పంది మార్క్, పట్టణ కోశాధికారి పాస్టర్ స్పర్జన్ రాజు, పాల్వాయి అజయ్ పాస్టర్ సామెల్ 100 మంది పైగా పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316