

న్యూస్ 24అవర్స్ టివి-నర్సాపూర్ ప్రతినిధి, 06.04.2025: ప్రజల కష్ట సుఖాలే పరమార్థంగా, పితృ వాక్య పాలన చేసిన శ్రీ రాముని జీవితం ఆదర్శ నియమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితారెడ్డి అన్నారు. శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణ ఫరిదిలోని సీతారాం పూర్ గ్రామంలో ప్రతీయేటా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఒకే మాట.. ఒకే బాణం…ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముని జీవితాంతం ధర్మాన్ని నమ్ముకున్నాడన్నారు ధర్మం కోసం యుద్ధం చేసి విజయం సాధించాడన్నారు. మానవ అవతారం ఎత్తిన శ్రీరాముడు నడిచినదారి నమ్ముకున్న ధర్మం ఆయన గుణగణాలతో శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవఅవతారంగా ప్రసిద్ధి చెందాడన్నారు, పితృ వాక్య పరిపాలనకు తండ్రి దశరథుడి మాటకుకట్టుబడి శ్రీ రాముడు అయోధ్యారాజ్యాన్నివదిలి అరణ్యవాసంవెళ్ళారని ఆస్తులుఅధికారం రాజ భోగాలు ముఖ్యంకాదని విలువలే ప్రధానమని ఆయన జీవితం చాటుతుందన్నారు. శ్రీ రాముని రాజ్యంలో ప్రజలను తనకన్నబిడ్డల్లా తన కంటి పాపల్లాగా చూసుకున్నాడని వారి శ్రేయస్సుకంటే తనవ్యక్తిగత జీవితం తన ఆనందం గురించి ఎప్పుడు ఆలోచించలేదన్నారు. అందుకే శ్రీరామ రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటారని అన్నారు. శ్రీ రాముని బాటలో ప్రజలంతా సాగాలని కోరారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బారాసా పార్టీ సీనియర్ నాయకులు చంద్రా గౌడ్, సత్యం గౌడ్, శివ కుమార్ సూరారం నర్సింలు నర్సింగ్ రావు ఎల్లమయ్య గణేష్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు హాజరుకావడం జరిగింది.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316