
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 28.03.2025: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలో సుధా కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ (సుధా బ్యాంక్) తమ ఏడవ శాఖను తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ప్రారంభించారు. బ్యాంకు ప్రారంభోత్సవంలో పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్, వ్యాపారవేత్త కందుకూరి లక్ష్మయ్య, సుంకరి జనార్ధన్, పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, ఆడితీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంకెపెల్లి నరసింహారెడ్డి, ప్రముఖ ట్రేడర్ సామ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ప్రారంభ అనంతరం శాసనసభ్యులు సామెల్ మాట్లాడుతూ తిరుమలగిరి పట్టణంలో సుధా బ్యాంక్ శాఖ ప్రారంభించడం ఎంతో సంతోషదాయకం అని చెప్పారు. బ్యాంకు పాలకవర్గం ప్రజలకు ఉత్తమ సేవలు అందించి అందరి మన్ననలు పొందాలని ఆశించారు. బ్యాంకు తగు సెక్యూరిటీతో అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి రుణ వితరణ చేయాలని తద్వారా క్రమాభివృద్ధి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ మీలా మహాదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్, వైస్ చైర్మన్ పొనుగోటి నిర్మల, భోనగిరి భాస్కర్, అనంతుల ప్రభాకర్. ఎపూరు శ్రవణ్ కుమార్, కక్కినేని చంద్రశేఖర్, మీలా సందీప్ సుజాత, బోర్డ్ నిర్వహణ సభ్యులు చైర్మన్ స్వామి వెంకటేశ్వర్లు, చెన్నకేశవరావు, వెంపటి రమణ, గాలి శ్రీనివాస్ తదితర పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు.
తిరుమలగిరి టౌన్ వార్తల కవరేజి కి క్రింది నెంబర్ ను సంప్రదించండి:8074884972

ADVERTISEMENT

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316