
*సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలి..
*సంప్రదాయ రంగులు ఉపయోగం ఆరోగ్యకరం..
*ఎదుటి వారికి ఇబ్బంది కలిగించవద్దు..
*మహిళల పట్ల మర్యాదగా ఉండాలన్న నాగారం సిఐ రఘువీర్ రెడ్డి…

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 13.03.2025: హోళీ పండుగ సందర్భంగా నాగారం సర్కిల్ సీఐ రఘువీర్ రెడ్డి ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ హోళీ పండుగ ఉత్సవం జరుపుకునేవారు జాగ్రత్తలు పాటించాలని ఒక ప్రకటనలో కోరారు. యువత ఆదర్శంగా ఉండాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి, ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళ్ళవద్దు, సంప్రదాయ రంగులు ఉపయోగించడం ఆరోగ్యకరం అని సిఐ తెలిపినారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉత్సవం జరుపుకోవాలి, సంప్రదాయ పండుగలు ఏవైనా ప్రజలు కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలి అన్నారు. యువత వాహనాలను విచ్చలవిడిగా వేగంగా నడపవద్దు అని కోరినారు. నీటి ప్రవాహం, లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దు. ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దు అన్నారు. పండుగ వేళ ఎవరైనా గొడవలు పడినా, అసత్య ప్రచారం చేసినా, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మహిళలను వేదింపులకు గురిచేసిన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని సీఐ విజ్ఞప్తి చేసినారు. నాగారం, అర్వపల్లి, తిరుమలగిరి ప్రాంతాలలో ప్రధాన సెంటర్లలో నిఘా ఉన్నది, వాహనాల తనిఖీలు నిర్వహిస్తాం, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు అని సీఐ తెలిపినారు. అలా ఎవరైనా చేసినట్లయితే చట్టపైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316