
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 02.04.2025: ఈరోజు తిరుమలగిరిలోని ఫూలే – అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వర్ధంతి కార్యక్రమాన్ని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పులుసు వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ సర్ధార్ సర్వాయి పాపన్న గారు 16వ శతాబ్దంలోనే బహుజన రాజ్యాధికారం కోసం ఎలాంటి ధన బలం అదేవిధంగా పూర్వ తన కుటుంబ రాజకీయ బలం లేకున్నా నమ్ముకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ మిత్రులు ,నాయకులు కార్యకర్తలతోటే ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆనాటి ఔరంగాజేబు మీద కొట్లాడి భువనగిరి కోట తో పాటు 26 కోటాలను చేజిక్కించుకొని బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసి గోల్కొండ కోట మీద కూడా బహుజన జెండాను ఎగరేసిన బహుజన తెలంగాణ చత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు అని అన్నారు. అలాగే ఆత్మగౌరవం కోసం శత్రువుల చేత జిక్కి వారి చేత చంపబడటం కంటే తన బల్లెంతో తన గుండెలో పడుచుకొని ఆత్మగౌరవాన్ని చాటి చనిపోయిన వీరునిగా గుర్తించాలని, ఆత్మగౌరవం కంటే ఏది ముఖ్యం కాదని బహుజనులు అంత ఏకమైతే మళ్లీ రాజ్యాధికారం తెలంగాణలో మన వశం అవుతుందని తెలిపారు . పిడిత ప్రజలకోసం పోరాటం చేసి గోల్కొండ కోట ని ఏలిన సర్వాయి పాపన్న గారి ఆశయ సాధనలో ముందుకు సాగుతాం అని అన్నారు ఈ కార్యక్రమం లో సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు గిలకత్తుల రమేష్ గౌడ్. CPM పార్టీ నాయకులు కడెం లింగయ్య యాదవ్. BRS సూర్యాపేట జిల్లా నాయకులు కందుకూరి ప్రవీణ్ కుమార్. డాక్టర్ రామచంద్రన్ గౌడ్. డాక్టర్ గిరి గౌడ్. డాక్టర్ సాయి గౌడ్. గిల కత్తుల మల్లయ్య గౌడ్ గిలకత్తుల హనుమంత్ గౌడ్. కారు పోతుల నరేష్ గౌడ్ అనంతుల నరేష్ గౌడ్ కొంపెల్లి వీరమల్లు గౌడ్. పానుగంటి శ్రీను, మురళి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి టౌన్ వార్తల కవరేజి కి క్రింది నెంబర్ ను సంప్రదించండి:8074884972

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316