
న్యూస్ 24అవర్స్ టివి-తిరుపతి, 14.03.2025: కాణిపాకంలో కొలువుదీరిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు పనిచేయు అధికారులు, అర్చకులు, వేద పండితులు మరియు సిబ్బంది తో దేవస్థానం కార్యాలయం మీటింగ్ హాలు నందు సమావేశం నిర్వహించిన దేవస్థానం ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ సిబ్బంది ప్రతి ఒక్కరూ సంబోధించే ముందు, సెల్ ఫోన్స్ లో మాట్లాడే ముందు, సెట్ లో మాట్లాడే ముందు “గణేశా” అని సంబోధించవలసినదిగా కార్య నిర్వహణధికారి సూచించారు. స్వామి వారి దర్శనార్థమై విచ్చేయు భక్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి సమాధానాలు చెప్పాలని కోరారు. అధికారులు క్యూలైన్లు సమయానుకూలంగా తొందరగా సమన్వయం పాటించాలని సూచించారు. కౌంటర్ లో పనిచేసే సిబ్బందికి ఎప్పటికప్పుడు టికెట్లను తొందరగా ఇచ్చి భక్తులు అడిగిన వాటికి సమాధానం చెప్పాలని సూచించారు. ఆలయంలో శానిటేషన్ పై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈఓ లు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, ధనంజయ, హరిమాధవరెడ్డి, ప్రసాద్, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316