
న్యూస్ 24అవర్స్ టివి-తిరుపతి, 29.03.2025: పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీ తేల్చాల్సింది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్ధకంగా మిగిలింది.
ప్రవీణ్ మృతి యాక్సిడెంట్ గా చిత్రీకరంచారని పాస్టర్లు ఆరోపిస్తూ విచారణ చేసి దోషులను శిక్షించాలని పాస్టర్లు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి పై నిజానిజాలు తెల్చాలని తిరుపతి రేణిగుంట పరిసరప్రాంతాలకు చెందిన పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని భారీఎత్తున ర్యాలీ నిర్వహించి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.

ఈ నిరసనకు సంఘీభావం తెలిపిన సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు కొండ్రెడ్డి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాస్టర్ మరణించి వారం రోజులు గడిచినా ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించకపోవడం విచారకరమన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316