
***సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు జరుపుకోవాలి…
***ఈ ఉగాది ప్రజల జీవితం లో వెలుగులు నింపాలి…
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 29.03.2025: తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు జరుపుకోవాలనీ తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ జిల్లా కార్యాలయం నుండి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని పంతంగి వీరస్వామి గౌడ్ ఆకాంక్షించారు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, కలయికే ఉగాది పచ్చడి ప్రత్యేకత అన్నారు. మానవ జీవితంలో కూడా కష్టం, సుఖం ఆనంద, మనశ్శాంతి ఇవన్నీటిని కూడా జీవితంలో ఎదుర్కోవాలని పంతంగి వీరస్వామి గౌడ్ ఆకాంక్షించారు. చైత్ర మాసంలో నిర్వహించే ఉగాది ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. మూగబోయిన కోకిల గొంతు సవరించుకొని కిలకిల రాగాలు చేసే ఈ ఉగాది ప్రకృతి రమణీయతకు చిహ్నంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మోడు వారిన చెట్లు చిగురించి పచ్చదనాన్ని పరిచే ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త మలుపు తిరగాలని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు ఆరంభం ఉగాది పర్వదినం కావడమే గొప్ప విషయమన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతోను ఆయురారోగ్యాలతోను భగవంతుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది పండగ వేడుకలను అత్యంత సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె బాబా జిల్లా ఉపాధ్యక్షులు మహంకాళి ప్రణీత్ జిల్లా ఉపాధ్యక్షులు కోడి లింగయ్య యాదవ్ కార్యదర్శి కంభంపాటి అంజయ్య గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి గిరీశం పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ పట్టణ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న పట్టేటి కిరణ్ సారగండ్ల కోటేష్, రాపర్తి జానయ్య, రేసు నాగయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి బానోతు జానీ నాయక్ యాదగిరి రెడ్డి, నీలయ్య పెగ్గేపురం నరసయ్య, గిరీశం ఎస్ కే బాబా తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316