

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి, 20.03.2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనుంది ఎస్సీ. ఎస్టి. బిసి. మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఈ స్కీం కోసం ఆన్లైన్ ద్వారా మార్చి 17 తారీకు నుండి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హులైన వారికి 60% నుంచి 80%శాతం సబ్సిడీ వర్తిస్తుంది అని మామిడాల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల సమావేశంలో సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ సమావేశంలో మాట్లాడినారు అదేవిధంగా వేసవికాలంలో ఎండ తీవ్రత పైన పరిసరాల పరిశుభ్రత పైన ప్రజలకు కళారూపాల ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు.. ఈర్ల సైదులు. గడ్డం ఉదయ్. వెన్నెల నాగరాజు. మాగి శంకర్. పాక ఉపేందర్. మేడిపల్లి వేణు. మద్దిరాల మంజుల. సిరి పంగి రాధ. నెమ్మాది స్రవంతి. పోతరాజు శిరీష. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316