
న్యూస్ 24అవర్స్ టివి-స్టేట్ బ్యూరో చీఫ్, 02.03.2025: రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని, స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు.

రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని వివరించారు. ముందుగా మాంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టాభిషేక మహోత్సవం అనంతరం ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు.


C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316