


న్యూస్ 24అవర్స్ టివి-మోతె, 05.02.2025: సూర్యాపేట జిల్లా మోతె మండలం విభళాపురం గవర్నమెంట్ స్కూల్లో నాయిని వెంకన్న మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన మనవరాలు నాయిని శరణ్య పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులందరికీ మధ్యాహ్నం భోజనం చేయడానికి స్టీలు ప్లేట్లు, గ్లాస్ లు ఉచితంగా బహుకరించి తన సేవా ధృక్పదాన్ని చాటుకున్న నాయిని వెంకన్న. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సురేష్ సార్, మాజీ సర్పంచ్ మొక్క వీరస్వామి, మాజీ సర్పంచ్ ఏపూరి వీరస్వామి, మైనంపాటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,కుంభజడ వెంకటేశ్వర్లు, మహేష్, వీరబాబు, నాగరాజు, విద్యార్ధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
5,940 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316