
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి రూరల్, 07.03.2025: తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిది (సీఎంఆర్ఎఫ్) చెక్కులు తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం తాటిపాముల గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు కి సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులు లకి అందజేశారు. లబ్దిదారుల వివరాలు పెరమాండ్ల పద్మ 60 వేల రూపాయలు, చెమిటి శాంతి కుమార్ 60 వేల రూపాయలు, పులిమామిడి నవ్య 60 వేల రూపాయలు, నాయిని కలమ్మ 60 వేల రూపాయలు, బొడ్డు మల్లయ్య 30 వేల రూపాయలు, దాసగాని ఉప్పమ్మ 44 వేల రూపాయలు, తాటిపాముల చింతయ్య 30 వేల రూపాయల చెక్కులును పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఎర్ర యాదగిరి, జిల్లా ఎస్సీ సెల్ బోనాసి పరశురాములు, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యామగాని సుదర్శన్, పులిమామిడి యాదగిరి, ఎర్ర నరసింహ్మ, యాదగిరి, తాటిపాముల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316