

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి, 01.03.2025: తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని సర్వే నెంబర్ 98 లో ఇచ్చిన మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని గ్రామస్తులు శనివారం అధికారులను కోరారు. తొండ మైనింగ్ జరిగే ప్రదేశాన్ని అధికారులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇదే సర్వే నెంబర్లు గతంలో రైతు వేదిక, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం, ఏర్పాటు చేశారని తెలిపారు. 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. ఇక్కడ మైనింగ్ పర్మిషన్ వస్తే భవనాలు పూర్తిగా దెబ్బతింటాయని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ పర్మిషన్ ఎంటర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ మైనింగ్ అధికారి విజయరామరాజు, తాసిల్దార్ హరిప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ సర్వేయర్, ఏఎస్ఐ నికోలస్, నీరటి ప్రవీణ్, ముత్యాల సోమయ్య, గొడుగు సోమనర్సయ్య, అంజయ్య, రమేష్, యాదగిరి, వెంకన్న, చంద్రయ్య, స్వామి, రైతులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316