
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 01.04.2025: తిరుమలగిరి మండల కేంద్రంలోని దేశం దుకాణాల్లో ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతోపాటు పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడమే ధ్యేయంగా పనిచేస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు సన్న బియ్యం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌక ధరల దుకాణం ( రేషన్ దుకాణం) 1నందు సన్న బియ్యం ప్రారంభించి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే ఎక్కువ శాతం మంది పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. బడుగు,బలహీన వర్గాల, అణగారిన,దళిత,గిరిజన, మైనారిటీ ప్రజలకు మూడు పూటలా అన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యామని ఆయన చెప్పారు. ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా పనిచేస్తుందని అన్నారు.బిఆర్ఎస్ 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరోజు సన్నబియ్యం ప్రజలకు పంపిణీ చేసింది లేదని ఇచ్చిన దొడ్డు బియ్యం కోళ్ల ఫారాలకు, బీర్ల తయారీకి కంపెనీకి వెళ్లిన పట్టించుకోలేదని, బియ్యం మార్పులకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం దారిద్ర రేఖకు దిగున ఉన్న దిగువన ఉన్న ప్రతి పేదవానికి సన్న బియ్యం పంపిణీ చేయాలన్న విప్లవాత్మకమైన మార్పుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రేషన్ కార్డుల మంజూరి విషయంలో బిఆర్ఎస్ పాలకులు ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శించారు.అది గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు అందించాలని రేషన్ కార్డుల మంజూరుకి నిర్ణయం తీసుకుందన్నారు. త్వరలోనే అందరికీ రేషన్ కార్డుల మంజూరు జరుగుతుందని పేర్కొన్నారు.తుంగతుర్తి నియోజకవర్గ బిడ్డగా తుంగతుర్తి అభివృద్ధికి శ్రమిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వంటచేసి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ , రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్ కు రుచి చూపించిన తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎల్సొజు చామంతి నరేష్ అనంతరం వారు సన్న బియ్యం వంట బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్, పిఎసిఎస్ చైర్మన్ పాలపు చంద్రశేఖర్, తాసిల్దార్ హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వై నరేష్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావతు జుమ్మిలాల్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి జనార్ధన్, జిల్లా యువజన ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, తుంగతుర్తి ప్రెస్ క్లబ్ ఇన్చార్జి కందుకూరి లక్ష్మయ్య, యువజన నాయకులు వంశీ, పత్తేపురం సుధాకర్, ఎస్ టి సెల్ అధ్యక్షులు ప్రేమ్ ప్రసాద్,గజ్జి లింగయ్య, రామోజీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి టౌన్ వార్తల కవరేజి కి క్రింది నెంబర్ ను సంప్రదించండి:8074884972

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316