
న్యూస్ 24అవర్స్ టివి-హైద్రాబాద్, 14.03.2025: హోలీ పండుగ పురస్కరించుకొని హైద్రాబాద్ లో కాలని వాసులతో మరియు సూర్యాపేట వాసులతో కలిసి హోళీ వేడుకలో పాల్గొన్న సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. హోళీ వేడుకల అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కొప్పుల వేణారెడ్డిని సూర్యాపేట వాసులు ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గం ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలను జరుపుకోవాలని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యండి.అంజద్ అలి, 5 వ వార్డు (దూరజ్ పల్లి) కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దెబోయిన శ్రీనివాస్, మద్దెబోయిన తిరుమలేష్, కొత్తపల్లి వెంకన్న, ధారవత్ సాగర్, సయ్యద్ జావేద్ తదితరులు ఉన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316