
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 08.03.2025: రాష్ట్రంలో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎంఎస్ఎఫ్ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ కందుకూరి సోమన్న డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రం లోని తెలంగాణ చౌరాస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ లను ఏబిసి కాకుండా ఏబిసిడి నాలుగు గ్రూపులుగా సామాజిక వెనుకబాటుతనo ఆధారంగా వర్గీకరించాలని,
రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు మాదిగ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీం అక్తర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి శాస్త్రీయంగా అధ్యయనం చేసి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ల ను కల్పించాలని, ఎస్సీలను ఏ బి సి డి లు గా 4 గ్రూపులుగా సామాజిక వెనుక బాట తనo ఆధారంగా వర్గీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య, సిపిఎం పార్టీ నాయకులు కడెం లింగయ్య, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు ఎమ్మార్పీఎస్ మండల పెద్దలు జేరిపోతుల యాదగిరి, కందుకూరి శ్రీను మాదిగ, ఎంఈఎఫ్ మండల నాయకులు కందుకూరి అంజయ్య మాదిగ, టిఆర్ఎస్ నాయకులు కందుకూరి ప్రవీణ్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కొండగడపల శ్రీనివాస్ మాదిగ, వి హెచ్ పి.ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల వెంకన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పోతరాజు సురేష్ మాదిగ, డప్పు కళాకారుల సంఘం తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షులు కందుకూరి రవి మాదిగ, డప్పు కళాకారుల తిరుమలగిరి మండల ఉపాధ్యక్షులు జేరిపోతుల శ్రీకాంత్, సురేష్, కొమ్ము సోమయ్య, కందుకూరి మహేష్, ట్రాన్స్ జెండర్ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు చిప్పలపల్లి నిహారిక, కందుకూరి మల్లయ్య, కందుకూరి యాదగిరి, పల్లెర్ల పెద్ద వెంకటేష్, పోతరాజు సైదులు,
తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316