

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 13.03.2025: సిపిఎం పార్టీ నాయకులను ముందస్తుగా ఏలాంటి సమాచారం లేకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్భందించడానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కడెం లింగయ్య తీవ్రంగా ఖండించారు. గురువారం తిరుమలగిరి మండలంలో పోలీసులు సిపిఎం పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం ప్రభుత్వ నిర్బంధ చర్యగా భావిస్తున్నామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోవడం శోచనీయమని, ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్న ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు, అర్హులైన పేదలందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఎన్నికల ముందు వీటన్నిటిని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ సంవత్సరం కావస్తున్న ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని తక్షణమే అమలు చేయలేదని, ఇచ్చిన వాగ్దాన అమలు చేయకపోతే స్థానిక సంస్థ ఎన్నికలలో గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కడారి లింగయ్య, చిత్తలూరి సోమయ్య, లక్ష్మి ,శీను, భిక్షం తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316