
న్యూస్ 24అవర్స్ టివి-తిరుపతి, 03.04.2025: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై గత 11 రోజులుగా తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద కార్మికులు ఎర్రటీ ఎండలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా యాజమాన్యం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తుందని సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి జయచంద్ర అన్నారు.
తప్పితే న్యాయమైన సమస్యలను పరిష్కరించే పరిస్థితి కూడా కనబడడం లేదని జయచంద్ర అన్నారు. కార్మికులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతూ ఈనెల 7వ తారీఖు సోమవారం నాడు జరగబోయే మహా ధర్నా పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. దశాబ్దాల కాలంగా ఎస్పీడీసీఎల్ ఆఫీసు నమ్ముకుని పనిచేస్తున్న వారిని రెగ్యులరైజేషన్ చేయకుండా కనీసం తెలంగాణ తరహాలో జీతాలను అమలు చేయడం లేదు. సబ్ స్టేషన్లలో పనిచేస్తూ ప్రాణాలు సైతం పోతున్న యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి లేదు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక వర్గాన్ని ఏకం చేసి రోడ్ల మీదకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డా. సాయి లక్ష్మి, సిఐటియు శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ లక్ష్మీ, సుజాత పాల్గొని మద్దతు ప్రకటించడం జరిగింది. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఏడో తారీకు జరుగుతున్నటువంటి మహా ధర్నాకు ప్రజాసంఘాల నుంచి తాము కూడా మద్దతు ప్రకటించి ఆందోళనకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు నివ్వడం జరిగింది. ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివ ప్రసాద్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కుమార్ మాట్లాడుతు ప్రమోషన్లు వచ్చినా జీతాలు పెంచే పరిస్థితి లేకుండా కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే విధంగా ఈ యాజమాన్యం లేదు. జీతాలు పెంచకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వం కాంటాక్ట్ వర్కర్స్ అందరిని పర్మినెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పినారు. జీవో నెంబర్ రెండును సవరించి అందరూ కాంటాక్ట్ వర్కర్స్ కు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి కార్యదర్శి రవి, మురళి, హరి, హుస్సేన్ పీర్, ఆత్మకూరు కార్యదర్శి విజయరామిరెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, అలీ తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316