
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 04.03.2025: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ మోడల్ కాలేజ్, తిరుమల సహకార జూనియర్ కాలేజ్ లను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు కు సర్వం సిద్దం చేశారు. తెలంగాణ మోడల్ కళాశాలలో మొదటి సంవత్సరం మొత్తం విద్యార్థులు 131మంది, ద్వితీయ సంవత్సరం మొత్తం విద్యార్థులు180 మంది కాగా తిరుమల సహకార జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం మొత్తం విద్యార్థులు 165 మంది హాజరుకానున్నారని చీఫ్ సూపరిండెంట్ పి. సంజీవ్ కుమార్ తెలిపారు.
5,945 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316