
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 12.02.2025: లయన్స్ ఐ హాస్పిటల్, లయన్స్ క్లబ్ సూర్యాపేట వారి సహకారంతో సూర్యాపేట పట్టణంలోని 45వ వార్డు విద్యానగర్ నందు గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లయన్స్ ఐ హాస్పిటల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యానగర్ నందు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ కు అభినందనలు తెలిపారు. లయన్స్ ఐ హాస్పిటల్ నందు కోటి రూపాయల విలువ చేసే అత్యాధునిక పరికరాలతో సురక్షితమైన కంటి ఆపరేషన్ లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండూరి కృపాకర్ మాట్లాడుతూ వార్డులోని ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

కంటి పరిక్షల అనంతరం కంటి అద్దాలు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి జమ్మిగడ్డలో గల లయన్స్ కంటి ఆసుపత్రి నందు ఉచితంగా ఆపరేషన్ లు చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 45వ వార్డులో కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులు ప్రజలకు అందుబాటులో వుండి నిత్యం పేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నూకల వెంకటరెడ్డి, జోన్ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, మీలా వంశి, వెంపటి శభరినాధ్, బండారు రాజా, కుమ్మరికుంట్ల లింగయ్య, భావ్ సింగ్, నూక వెంకటేశం గుప్త, మిర్యాల సుధాకర్, బెజగం ఫణి, వుల్లి రామాచారి, బొమ్మగాని సైదులు, ముద్ద భిక్షపతి, జానయ్య, మాశెట్టి శ్రీనివాసులు, గంట పవన్ ఆప్టమాలజిస్ట్, బాణాల వీరేంద్ర చారి, సందీప్, కార్తిక్, కళ్యాణ్, వేణు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.


C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316