న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట రూరల్, 15.03.2025: తన కొడుకుపై కేసు అయిందన్న కారణంతోనే చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన వల్లాల రమణ స్థానిక ఎస్ఐపై అసత్య ప్రచారం చేస్తుందని సూర్యాపేట రూరల్ సిఐ జి. రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 12న కుడకుడ గ్రామానికి చెందిన వల్లాల శివరామకృష్ణ తండ్రి జానకి రాములు అనే అతను కత్తి తీసుకుని వచ్చి తన ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి, మహిళపై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి తాను కట్టే గోడకు అడ్డం వస్తే చంపుతానని బెదిరించి ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేసినారని అతని ఇంటి పక్క వారైనా కొత్త శైలజ భర్త సైదులు అనే ఆమె శివరామకృష్ణ పై దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసిన చివ్వెంలా ఎస్ ఐ పరిశోధన నిమిత్తం కొత్తపల్లి శైలజ ఇంటి వద్దకు వెళ్లి విచారణ చేయనైనది. వల్లాల శివరామకృష్ణ వల్లాల రమణ కొడుకు కాగా తన కొడుకు పై కేసు నమోదు అయ్యిందన్న కారణంతో, అధికారులను తప్పుదోవ పట్టించేందుకు వల్లాల రమణ అసత్య ఆరోపణలు చేస్తుందని తెలిపారు. వల్లాల శివరామకృష్ణ మరియు అతని కుటుంబ సభ్యులపై 2024 సంవత్సరంలో కూడా కేసు నమోదైనది. వల్లాల రమణ ను స్థానిక ఎస్సై దూషించలేదని తెలిపారు. కేసు అయిన విషయం తెలిసి పోలీసులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.