

న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్ ప్రతినిధి, 05.04.2025: బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. ఆ మహానుభావుడికి తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశానికి అణగారిన వర్గాలకు అభ్యుదయానికి కృషిచేసిన భారత అమూల్యరత్న గ్రహీత భారత దేశ ఉప ప్రధానిగా సేవలందించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంను తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్, జిల్లా యువజన ఉపాధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆఫీస్, దొడ్ల రమేష్, ఆంగోతు రాములు నాయక్, మార్కెట్ యార్డు సిబ్బందులు సురేష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రేమ్ ప్రసాద్, రామోజీ, సంతోష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316