న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 15.03.2025: ఈ నెల16న తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్లోలో మద్యాహ్నం 3 గంటలకు ఎస్ సి వర్గీకరణ బిసి గణన చేసినందుకు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వ కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వేంకట రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్గొండ పార్లమెంటు సభ్యులు కందూరు రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ పాల్గొంటారు. కావునా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.