
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి టౌన్, 06.03.2025: కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపుతో పాటు పదవులు అవే వస్తాయని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు. గురువారం నాడు తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఎల్సోజ్ చామంతి నరేష్ తోపాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. నరేష్ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లో సామాన్య కార్యకర్తగా అంచలంచలుగా ఎదిగి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినందున ఈరోజు మార్కెట్ కమిటీ పదవి దక్కిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారి సేవలను పార్టీ గుర్తిస్తుందన్నారు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో దేశవ్యాప్తంగా దళిత గిరిజనులకు సముచిత స్థానం కల్పించి వారికి అన్ని రంగాలలో ప్రాముఖ్యత కల్పించారన్నారు. నేడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాభిమానాన్ని చుర గొన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్యారంటీ లను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్కిందని చెప్పారు. తాను తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఏళ్లుగా చేసిన కృషి ఫలితంగానే తనను ఈ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు 50 వేల మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీ తో పాటు సింగిల్ విండో చైర్మన్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన చెప్పారు. నియోజకవర్గ మొత్తం కాంగ్రెస్ మయంగా మారిపోయిందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తిరుమలగిరి మున్సిపల్ కేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ తో పాటు తొండ గ్రామంలో 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేయించానని అన్నారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టానని ఆయన చెప్పారు. తాను తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంత ప్రజల కష్టసుకాలను తెలుసుకొని వారి అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినున్నట్లు చెప్పారు. తిరుమలగిరి మండలంలో కోక్యా తండా ను పైలెట్ ప్రాజెక్టుగాఎంపిక చేశామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు పనికి రాకుండా పోయాయని ఆయన చెప్పారు. మార్కెట్ కమిటీలు రైతు సంక్షేమ కోసం రైతుల రైతు పక్షపాతిగా పనిచేసే మార్కెట్ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముందుగా తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా ఏల్సోజు చామంతి తో పాటు డైరక్టర్లు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార కార్పొరేషన్ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తో పాటు పిఎసిఎస్ చైర్మన్ పాలపు చంద్రశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాల్, మున్సిపల్ అధ్యక్షులు పేరాల వీరేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్ధన్, రామోజీ, సుధాకర్, నాతి వీరమల్లు గౌడ్, కల్లెట్లపల్లి రాములు, జంగిల్ ఉపేందర్, దరావత్ రాములు నాయక్.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316