
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట టౌన్, 03.03.2025: సూర్యాపేట జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు తిరుమలగిరి మండలంలోని కన్నారెడ్డికుంట తండ గ్రామపంచాయతీలో నిర్వహించిన కళాజాత సమావేశంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ మత్తుకు బానిసలు కావద్దు తల్లిదండ్రులకు భారం కావద్దు అంటూ మాట్లాడినారు. అదే విధంగా పరిసరాల పరిశుభ్రత, పాన్ మసాలా, గుట్కా, సారా నిషేధం పైన కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ కేతిరెడ్డి మంగ, ఏఎన్ఎం మేడే ఝాన్సీ, ప్రవళిక సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు ఈర్ల సైదులు, గడ్డం ఉదయ్, వెన్నెల నాగరాజు, మాగి శంకర్, పాక ఉపేందర్, మేడిపల్లి వేణు, మద్దిరాల మంజుల, సిరిపంగి రాధ, నెమ్మాది స్రవంతి, పోతరాజు శిరీష, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316