

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరువు ప్రతినిధి, 06.04.2025: గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిన్నారం సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఎండి నయీముద్దీన్, యస్.ఐ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం షాబాష్ పల్లి కి చెందిన షేక్ ఫయాజ్ అలియాస్ ఫయూ(A1), A2.చాపల సంజీవ్ నవాజ్ (A2) ఇద్దరు కలసి గుమ్మడిదల రామ్ రెడ్డి బావి కానుకుంట మరియు నల్లవల్లి గ్రామాలలో రాత్రి వేళలో తిరుగుతూ గ్రామానికి బయట ఉన్న దేవాలయాలను ఎంచుకొని వాటి తాళాలు పగలగొట్టి హుండీలను పగలగొట్టి అందులో ఉన్న డబ్బులను ఇతర వస్తువులను దొంగలించినారు. ఆదివారం ఉదయం గుమ్మడిదల పోలీసులు మరియు సంగారెడ్డి సి.సి.యస్ పోలీసులు కలిసి వారిని అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి 25 వేల రూపాయల నగదు, దొంగతనాలు చేయడానికి వాడిన ఒక పల్సర్ బైకు, రెండు సెల్ ఫోన్ లను స్వాదీనం చేసుకొని వారిని రిమాండ్ కు పంపినారు. వీరిలో షేక్ ఫయాజ్ అలియాస్ ఫయు పైన 33 దొంగతనం కేసులు, చాపల సంజీవ్ నవాజ్ పైన 26 దొంగతనం కేసులు ఉన్నాయని ఎస్సై మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316