

న్యూస్ 24అవర్స్ టివి-పటాన్ చెరు ప్రతినిధి, 20.04.2025: గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని, ఇటువంటి కేంద్రాలు ప్రజలకు మరింత సౌలభ్యం కలిగిస్తాయని సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని వర్తక సంఘం భవనంలో ప్రొప్రైటర్ విక్రమ్ సమక్షంలో ఏర్పాటు చేసిన ‘శ్రీ అయ్యప్ప కమ్యూనికేషన్ డిజిటల్ సేవా సెంటర్’ను ఆయన ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రతి గ్రామానికీ డిజిటల్ కనెక్టివిటీ అవసరం అని అన్నారు. యువత ఐటీ రంగంలోకి అడుగుపెట్టి అభివృద్ధి చెందేందుకు ఇలాంటి సేవా కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయి అన్నారు. యువత ఇలా స్వయం ఉపాధి మార్గంలో ముందుకు రావడని ప్రశంసించారు. ఈ ప్రారంభోత్సవంలో మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్,సదానందరెడ్డి,మోహన్ రెడ్డి,దేవేందర్ రెడ్డి ఆకుల సత్యనారాయణ చంద్రారెడ్డి కె.బాల్ రెడ్డి సుధాకర్ రెడ్డి జయపాల్ రెడ్డి వెంకట్ రెడ్డి డిజిటల్ సేవా నిర్వాహకులు పాల్గొన్నారు.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316