
న్యూస్ 24అవర్స్ టివి-సూర్యాపేట ప్రతినిధి, 39 అక్టోబర్ 2026: సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశంలో కేసుల వివరాలు, అరెస్ట్ వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ కిరాణా షాపుల్లో మహిళలు ఒంటరిగా ఉన్న సమయాన్ని అదునుగా చేసుకొని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. (ఖమ్మంలో గల ముత్తూట్ ఫైనాన్స్ నందు కుదవ లో ఉన్నది). ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా A1: షేక్ ఖాసీం(23) @ షన్ను, A2: తుమ్మాటి భరత్ కుమార్(24) @ భరత్ లపై ఖమ్మంలో ఇద్దరిపై ఖమ్మంలో గంజాయి కేసులు ఉన్నాయి.
కేసు వివరాలు: ఈ నెల 26వ తేదీన సాయంత్రం 6.45 గంటల సమయంలో సూర్యాపేట పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఒక కిరాణా షాపులో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు సిగరెట్, వాటర్ బాటిల్, సెంటర్ ఫ్రెష్ కావాలని అడిగారు. ఆమె వాటిని ఇచ్చే పనిలో నిమగ్నమైన సమయంలో మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును లాక్కొని మోటార్ సైకిల్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై సూర్యాపేట II టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా ఈ నెల 11వ తేదీన కోదాడ పట్టణంలోనూ ఒక కిరాణా షాపులో మహిళ మెడలోని సుమారు రెండు తులాల బంగారు పుస్తెల తాడును ఇదే తరహాలో అపహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలకు సంబంధించి పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇద్దరు అనుమానితులను గుర్తించి, విశ్లేషంచగా గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను నిరంతరం పర్యవేక్షించారు. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీన పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆదేశాలతో సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద II టౌన్ ఎస్ఐ కె. గోపికృష్ణ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఖమ్మం వైపు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి అనుమానాస్పదంగా వ్యవహరించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా రెండు చైన్ స్నాచింగ్ ఘటనల్లో తామే పాల్గొన్నట్లు వెల్లడైంది. నిందితులను ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ ఖాసీం అలియాస్ షన్ను (23), తుమ్మాటి భరత్ కుమార్ అలియాస్ భరత్ (24)గా గుర్తించారు. వీరిలో షేక్ ఖాసీంపై యాదాద్రి మోత్కూరు పోలీస్ స్టేషన్ నందు గంజాయి, దొంగతనం కేసులు ఉండగా, తుమ్మాటి భరత్‌పై ఖమ్మం టౌన్ పోలీస్ స్టేషన్, ఖమ్మం జిల్లా హవేలీ పోలీస్ స్టేషన్ నందు గంజాయి కేసులు ఉన్నాయి. నిందితుల వద్ద సుమారు రూ.4 లక్షల విలువైన బంగారాన్ని ఖమ్మం పట్టణంలో ముత్తూట్ ఫైనాన్స్ నందు కుదవ పెట్టినట్లు గుర్తించడం జరిగింది దీనిని స్వాధీన పరుచుకుంటామన్నారు.
ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం.. అలవాటుగా నేరాలు పాల్పడుతూ ప్రజలను ఇబ్బంది చేసే వారిని జిల్లా బహిష్కరణ చేయడం రౌడీ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ నమోదు చేయడం చేస్తున్నామని పిడిఎఫ్ నమోదు చేసి ఎక్కువ కాలం జైలుకు పంపడానికి ప్రణాళిక చేయడం జరుగుతుందని ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎస్పి అన్నారు. మహిళలు జాగ్రత్తగా ఉండాలి..
మహిళలు, ముఖ్యంగా దుకాణాలు నిర్వహించే వారు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ప్రజలు ఎక్కువ మొత్తంలో సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు.
రెండు కేసులను ఛేదించి నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ గోపి కృష్ణ, రామనరసయ్య, శ్రీరాములు, కొండ రమేష్, నవీన్ లు బాగా పని చేసినారని జిల్లా ఎస్పీ కె. నరసింహ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ వెంకటయ్య, ఎస్ఐ లు సందీప్, కనకరత్నం, సిబ్బంది పాల్గొన్నారు.