
న్యూస్ 24అవర్స్ టివి-హైదరాబాద్, 12.04.2025: జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు సంబంధించిన జీవో ఈ నెలలో విడుదలయ్యే అవకాశం వుందని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య అన్నారు. ఇటీవల జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పకడ్బందీగా పలు రకాల మార్పులతో ఈ జీవో రూపొందించినట్టు సమాచారం. కనుక ప్రభుత్వం జీవో విడుదల చేసిన వెంటనే జర్నలిస్టులు ఆన్లైన్ లో కొత్త ఫార్మాట్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జీఓ ఎప్పుడైనా విడుదలకానుండడంతో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసుకోడానికి జర్నలిస్టులంతా తమ ఫోటో, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు సిద్దంగా వుంచుకోవాలని మామిడి సోమయ్య కోరారు.
5,909 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316