
న్యూస్ 24అవర్స్ టివి-తిరుమలగిరి రూరల్, 26.03.2025: మండలంలోని తొండ గ్రామంలో వేసవి కాలంలో ప్రజలు నీటిని పొదుపు చేసుకోవాలని కోరుతూ సాంస్కృతిక సారధి కళాకారులూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటి పోకుండ నీటి నిలువలు, చెక్ డ్యాములు, ఊర కుంటల సామర్థ్యం పెంచాలని నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. యువత మదకద్రవ్యాలు వాడకం ఆరోగ్యానికి హానికరం అని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో సాంస్కృతిక సారధి కళాకారులు ఈర్ల సైదులు. గడ్డం ఉదయ్. వెన్నెల నాగరాజు. మాగి శంకర్. పాక ఉపేందర్. మేడిపల్లి వేణు. మద్దిరాల మంజుల. సిరిపంగి రాధ. నెమ్మాది స్రవంతి. పోతరాజు శిరీష. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి రూరల్ వార్తల కవరేజి కి క్రింది నెంబర్ ను సంప్రదించండి:8074884972.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316