
హాస్య బ్రహ్మ బ్రహ్మానందంపై రాధా మనోహర్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ “మీరు రాకూడదు, మీరు చదువుకోకూడదు, మీరు చదువుకుంటే దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయని భయపెట్టి స్త్రీలను చదువుకి దూరంగా ఉంచారు. ఆ రోజుల్లో స్త్రీలు అసలు ముట్టుకోకూడదని చెప్పారు.” అని అన్నారు. అయితే బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలను రాధా మనోహర్ దాస్ తీవ్రంగా తప్పుబట్టారు.
“మనం మట్టిలో భగవంతుడిని చూస్తాం. భూమాత అంటాం. గోమాత అంటాం. గంగమ్మ అంటాం. పుస్తకాన్ని సరస్వతి అంటాం. డబ్బులను లక్ష్మీదేవి అంటాం. అన్నాన్ని అన్నపూర్ణ అంటాం. ఇది మనం అమ్మని చూసే విధానం. బ్రహ్మానందం తెలుగు లెక్చరర్ అయ్యుండి, ఎందుకు బుర్ర పనిచేయలేదు నాకర్థం కావాలి. యాత్ర నార్యస్తు పూజ్యంత్రే, రమంతం. దేవతాః అని మనుధర్మ శాస్త్రం చెబితే బ్రహ్మానందం అలా ఆయన త్వరలో క్షమాపణలు చెబుతాడు. అలాగే బ్రహ్మానందం ఇలా ప్రసంగిస్తాడా?” అని బ్రహ్మానందం వ్యాఖ్యలపై రాధా మనోహర్ దాస్ అసహనం వ్యక్తం చేశారు. మరి ఈ వివాదంపై బ్రహ్మానందం ఎలా కనిపిస్తారో చూడాలి.

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316