
స్వర్ణ భారత జ్యోతి-స్టేట్ బ్యూరో చీఫ్, 06.02.2025: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో తెలంగాణా రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో తెలంగాణలో క్రైస్తవ మతం పాటిస్తున్న వారి శాతం 2001లో 1.24 శాతంగా, 2011లో 1.27 శాతంగా నమోదు అయిందని, తెలంగాణా గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే లో 2.29 శాతం వుందనీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తేల్చిందని అన్నారు, ప్రస్తుతం 3.5% ఉండొచ్చని నిపుణులు చెప్పుతున్నారు, కానీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి నోటా క్రైస్తవుల జనాభా శాతం ఊసేలేదనీ, తెలంగాణ రాష్టం లో క్రైస్తవులు మూడవ అతిపెద్ద మతపరమైన మైనారిటీలను అణిచివేసే కుట్ర చేస్తున్నరని, కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణాలోనీ క్రైస్తవుల జనాభా శాతం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున బిషప్ దుర్గం ప్రభాకర్. తెలంగాణ – 2024 కుల గణనలో క్రైస్తవుల సంఖ్య తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కలోనే లేదనీ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆ లెక్కలు దాచి పెట్టి మోసం చేసిందని అన్నారు, తెలంగాణలో క్రైస్తవ జనాభా ఏమైనట్లు? ఏమి జరుగుతుందో ఇప్పటికైనా క్రైస్తవులు తెలుసుకోవాలనీ, క్రైస్తవులను అణిచివేసే కుట్ర బిజెపితో కలిసి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందనీ అనటానికి ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందనీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అధికార నాయకులు ఎవ్వరు కూడా నమ్మటం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మ్యానిపేస్టో లో హిందూ పూజరులకు, ముస్లిం ఇమామ్ లకు మాదిరిగానే క్రైస్తవ మత పెద్దలకు, పాస్టర్స్ కు రూ.10,000 గౌరవ వేతనం ఇస్తామని అబద్దాలు చెప్పి క్రైస్తవులను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిదని గుర్తు చేస్తున్నామన్నారు. తెలంగాణాలోనే క్రైస్తవులు లేనట్టు తప్పుడు సమాచారం ఇస్తూన్నారని, హిందూవులలో, ముస్లింలలో ఓసి, బిసి ఉన్నారు. కానీ ఏమీ లేనట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసం చేసినారు. కావున తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి క్రైస్తవుల జనాభా శాతం వెంటనే ప్రకటించాలి. తెలంగాణా లో ఓసి బిసి ఎస్సీ ఎస్టీ క్రైస్తవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారనీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మ్యాన్ పేస్టో లో చెప్పినట్టుగా రాష్ట్ర ముఖ్య మంత్రి పాస్టర్స్ కు గౌరవ వేతనం రూ. 10,000 లు ఈ అసెంబ్లీ సమావేశంలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టలని తెలంగాణా రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ తరపున ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తున్నామన్నారు .


C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316