
బాధితురాలికి న్యాయం జరగాలని
ఆనంద బజార్ పత్రిక కథనం ప్రకారం.. సీబీఐ తన పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను ప్రశ్నించింది. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాజ్దీప్ మజుందార్ వాదనలు వినిపిస్తూ, ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసినప్పుడు బాధితురాలి కుటుంబం, సీబీఐ లేదా దోషి మాత్రమే హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. సీబీఐ అభ్యంతరాన్ని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది, అడ్వొకేట్ జనరల్ కిశోర్ దత్తా వ్యతిరేకించారు. బాధితురాలికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, దోషులను కఠినంగా శిక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
5,933 Views

C.E.O
NEWS 24HOURS TV
Phone: 9290999316